ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పౌర చట్ట సవరణ బిల్లు వ్యతిరేకించడంపై ముస్లింల హర్షం - Civil Law Amendment Bill in ap

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ముస్లింలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి క్షీరాభిషేకం చేశారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పౌర చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

ముస్లింల హర్షం
ముస్లింల హర్షం

By

Published : Jun 19, 2020, 3:32 PM IST

పౌర చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేయడంపై అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ముస్లిం సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి.. స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి క్షీరాభిషేకం చేశారు.

పౌర చట్ట సవరణ బిల్లులను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడంతో సీఎం జగన్మోహన్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు, గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి

ABOUT THE AUTHOR

...view details