ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 14, 2021, 7:53 PM IST

ETV Bharat / state

ఉరవకొండలో రంజాన్ వేడుకలు

పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఉరవకొండలో ఘనంగా జరుపుకున్నారు..కొవిడ్ కారణంగా ఇంటి వద్దే.. కొందరు ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. కరోనా మహమ్మారి అంతమవ్వాలని ఆ దేవుణ్ని ప్రార్థించారు.

Ramadan celebrations
రంజాన్ వేడుకలు

అనంతపురం జిల్లా ఉరవకొండలో రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. పట్టణంలోని ఈద్ దర్గా వద్ద కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని.. కరోనా మహమ్మారి అంతమవ్వాలని.. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుణ్ని కోరుకున్నట్లు ముస్లిం సోదరులు తెలిపారు.
కొందరు ఇంటి వద్దే రంజాన్ ప్రార్థనలు నిర్వహించారు.సేవా భావానికి ప్రతీక అయినా రంజాన్ పండుగను ప్రతి ముస్లిం సంతోషంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details