ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధర్మవరం యువకుడి హత్యకేసును ఛేదించిన పోలీసులు - ధర్మవరం యువకుడి హత్యకేసును ఛేదించిన పోలీసులు

ధర్మవరం యువకుడి హత్యకేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. బాధితుడి భార్య పిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

ధర్మవరం యువకుడి హత్యకేసును ఛేదించిన పోలీసులు

By

Published : Jul 21, 2019, 11:30 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన మారెప్ప అనే యువకుడి హత్య కేసులో... అతని సోదరుడైన రామచంద్రను ధర్మవరం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు వంద రూపాయలు ఇవ్వకపోవటమే కారణమని పోలీసులు వెల్లడించారు.
అసలేమైంది?
మారెప్ప... అతని సోదరుడు రామచంద్ర భవన నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగించేవారు. మద్యం తాగేందుకు రూ. 100 ఇవ్వాలని రామచంద్రుని అడిగాడు. డబ్బు లేదని రామచంద్ర చెప్పటంతో... సోదరుడుపై మారెప్ప కర్రతో దాడి చేశాడు. ఆగ్రహించిన రామచంద్ర... ఇంటిలో ఉన్న చాకుతో మారెప్పను పొడిచాడు. అపస్మారక స్థితిలో ఉన్న మారెప్పను ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో చనిపోయాడు" అని సీఐ అష్రార్ బాషా తెలిపారు.

ధర్మవరం యువకుడి హత్యకేసును ఛేదించిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details