ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హత్య కేసు నిందితుడు అనుమానాస్పద మృతి.. పోలీసుల దర్యాప్తు - murder case accused death news in tadipatri

ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హత్య కేసు నిందితుడి అనుమానాస్పద మృతి.. పోలీసుల దర్యాప్తు
హత్య కేసు నిందితుడి అనుమానాస్పద మృతి.. పోలీసుల దర్యాప్తు

By

Published : Aug 18, 2020, 3:45 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం సీపీఐ కాలనీ సమీపంలోని ముళ్ల పొదల్లో గుర్తు తెలియని యువకుని మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు తాడిపత్రి పట్టణం గన్నేవారిపల్లి కాలనీకి చెందిన సాకే అనిల్(24)గా గుర్తించారు. అనిల్ ఐచర్ డ్రైవర్​గా విధులు నిర్వహిస్తున్నాడు.

2019లో సింగనమలకు చెందిన తలారి చంద్రశేఖర్ అనే ఐచర్ డ్రైవర్ హత్య కేసులో సాకే అనిల్ నిందితుడు. అనిల్ మెడపై తాడుతో బిగించి చంపిన ఆనవాళ్లు ఉండటంతో ఎవరైనా పథకం ప్రకారమే హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details