ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటిముందు నిద్రిస్తున్న వ్యక్తిపై హత్యాయత్నం - ananthapuram district

ఇంటిముందు నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై దుండగులు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా కంబదూరులో జరిగింది. బండరాయితో తలపై మోది చంపడానికి యత్నించగా అది గురి తప్పి ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ananthapuram district
ఇంటి బయట నిద్రిస్తున్న వ్యక్తి పై హత్యా యత్నం..

By

Published : May 9, 2020, 9:57 PM IST

అనంతపురం జిల్లా కంబదూరు మండలం రాళ్లఅనంతపురంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వెంకటస్వామి తన ఇంటిముందు నిద్రిస్తుండగా అర్ధరాత్రి దాటాక.. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను బండరాయితో మోది హత్య చేసేందుకు యత్నించారు. అయితే సరిగ్గా ఆసమయానికి ఆయన పక్కకు జరగడం వల్ల తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన వెంకటస్వామి బంధువులు అతన్ని కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కంబదూరు ఎస్ఐ గౌస్ తీరా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details