అనంతపురం శివారు ఎర్రనేల కొట్టాల కాలనీకి చెందిన హాజీ అనే వ్యక్తికి షేక్షావలీ అనే మరో వ్యక్తి.. రూ.వెయ్యి ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో డబ్బు ఇవ్వాలంటూ హాజీ... షేక్షావలీతో ఘర్షణకు దిగాడు. అనంతరం తన మిత్రులతో కలిసి హాజీ... షేక్షావలీని కత్తితో 13చోట్ల పొడిచాడు.
అప్రమత్తమైన స్థానికులు బాధితుడిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అనంతపురం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ వెల్లడించారు.