సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికుల నిరసన - Municipal workers' problems must be solved
అనంతపురం జిల్లాలో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు కనీసం యూనిఫాం దుస్తులు ఇవ్వలేదని... సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
సమస్యలు పరిష్కారించాలని మున్సిపల్ కార్మికుల నిరసన
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అనంతపురంలో సీఐటీయూ నాయకులు నిరసన చేపట్టారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో కార్మికులతో కలిసి ఒంటికి చెట్టు కొమ్మలను చుట్టుకొని వినూత్నరీతిలో నిరసన తెలిపారు. మున్సిపల్ కార్మికులకు కనీసం యూనిఫాం ఇవ్వటం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని...అధికారుల కోరారు. అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.