గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల నిరసన - అనంతపురంలో మున్సిపల్ కార్మికుల ధర్నా
అనంతపురం జిల్లా గుంతకల్లులో పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. 279 జీవో తీసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం... ఓడబ్ల్యూఎమ్మెస్ పేరిట కొత్త డ్రామాలు తెరపైకి తెస్తుందని ఆరోపించారు. వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.

అనంతపురం జిల్లా గుంతకల్లులో పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం కొత్త కార్మిక చట్టాలను తెచ్చి తమకు అన్నివిధాల అన్యాయం చేస్తోందని వాపోయారు. వైకాపా ప్రభుత్వం 279 జీవో రద్దు చేసి... కనీస వేత సవరణ రూ.18000 రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటన చేసినా... అధికారులు మాత్రం తమకు ఏమాత్రం తెలియనట్లు వ్యవహరిస్తున్నారని కార్మికులు వాపోయారు. కేవలం కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడానికే అధికారులు తమను ఆంక్షలు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. 279 జీవో తీసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం... ఓడబ్ల్యూఎమ్మెస్ పేరిట కొత్త డ్రామాలు తెరపైకి తెస్తుందని అన్నారు. వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని అధికారులను హెచ్చరించారు.