అనంతపురం జిల్లా కదిరి పట్టణం క్లాక్ టవర్ సమీపంలోని హిందూపురం మార్గంలో దెబ్బతిన్న కల్వర్టు మరమ్మతు పనులను అధికారులు చేపట్టారు. కల్వర్టు మధ్యభాగంలో సుమారు ఆరు నెలల కిందట భారీ రంధ్రం పడింది. అప్పుడు మరమ్మతులు చేపట్టకుండా అలసత్వం ప్రదర్శించారు. రహదారి మధ్యలో బారికేడ్లను ఏర్పాటు చేసి వదిలేశారు.
ఇదే కల్వర్టుపై తాజాగా మరో రంధ్రం ఏర్పడింది. రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై.. స్థానికుల ఫిర్యాదుతో అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు.. ఆ మార్గంలో భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సమస్య పరిష్కారానికి మరమ్మతు పనులు చేపట్టారు.