ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 4, 2021, 10:12 AM IST

ETV Bharat / state

గుంతకల్లు మున్సిపల్ బరిలో 110 మంది

అనంతపురం జిల్లా గుంతకల్లులో నామినేషన్స్​ ఉపసంహరణ ముగిసింది. గుంతకల్లు మున్సిపాలిటీకి పోటీకి 208 మంది నామినేషన్స్ దాఖలు చేయగా.. అందులో 90 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. మూడు స్థానాలు ఏకగ్రీవం కాగా.. 110 మంది అభ్యర్థులు ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. మరోవైపు గుత్తి మున్సిపాలిటీలో 56 మంది బరిలో నిలిచారు.

nominations withdraw
నామినేషన్ల ఉపసంహరణ

అనంతపురం జిల్లా గుంతకల్లులో మున్సిపల్​ నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ రెండో రోజు సజావుగా సాగింది. గుంతకల్లు మున్సిపాలిటీలో మొత్తంగా 37 వార్డులలో 208 మంది కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. మొత్తం 95 మంది ఉపసంహరణ చేసుకున్నారు. ప్రస్తుతం 110 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఏకగ్రీవాలు..

10, 22, 24 వార్డుల్లో అభ్యర్థులు నామినేషన్స్ ఉప సంహరించుకోవడంతో వైకాపా అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఇందుకు సంబంధించిన మున్సిపల్ అధికారులు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అభ్యర్థులకు జారీ చేశారు. ఇందులో వైకాపా ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి కూతురు 24వ వార్డులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

గుత్తిలో 56 మంది పోటీ..

గుత్తి పురపాలక సంఘంలో 119 మంది కౌన్సిలర్ అభ్యర్థులకు గాను.. 57 మంది కౌన్సిలర్ అభ్యర్థులు ఉపసంహరణ చేసుకోగా 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 6 స్థానాల్లో పోటీ ఎవ్వరూ లేని కారణంగా వైకాపా ఆ స్థానాల్లో ఏకగ్రీవంగా గెలిచింది.

ఇదీ చదవండి:

వైకాపాలో చేరిన తెదేపా కార్యకర్తలు

ABOUT THE AUTHOR

...view details