ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమీపిస్తున్న గడువు... ప్రచార జోరు పెంచిన ప్రధాన పార్టీలు - ananthapuram district latest news

అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. జిల్లాలోని పలు పట్టణాల్లో వివిధ పార్టీల ముఖ్యనేతలు ఇంటింటికి తిరుగుతూ తమ పార్టీకి చెందిన అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.

municipal election campaigning in ananthapuram district
అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం

By

Published : Mar 6, 2021, 5:52 PM IST

అనంతపురం నగర పాలక సంస్థ వైకాపా మేయర్ అభ్యర్థి.. చవ్వా రాజశేఖర్​రెడ్డి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రచారం నిర్వహించారు. రెండేళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధే.. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

కళ్యాణదుర్గంలో...

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఇన్​ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఉమామహేశ్వర నాయుడుతో పాటు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి... సత్యప్ప కూడా ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు వైకాపా నేత శ్రీచరణ్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.

గుంతకల్లులో...

మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంతకల్లులో జేసీ పవన్ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తమ పార్టీ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వైకాపా పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేస్తూ.. రియల్ ఎస్టేట్ కోసం లక్షల ఎకరాల భూమిని దోచేయడానికి వైకాపా నేతలు కుట్రపన్నారని ఆరోపించారు.

తాడిపత్రిలో...

తాడిపత్రిలో తెదేపా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. పట్టణాన్ని తాను ఎంత అభివృద్ధి చేసామో చూసి ఓటేయాలని ప్రజలను కోరారు. వైకాపా పాలనలో తాడిపత్రికి ఏం చేశారో చెప్పాలని వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సవాల్ విసిరారు.

ఇదీచదవండి.

చిన్నారులు, మహిళలపై నేరాలు నానాటికీ అధికమవుతున్నాయి: జస్టిస్ గోస్వామి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details