Muncipal Workers Second Day Strike:సమాన పనికి సమాన వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య, పొరుగు సేవల కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజూ ఉద్ధృతంగా సాగింది. మున్సిపల్ కార్యాలయాల వద్ద వినూత్న నిరసనలతో హోరెత్తించారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ప్రధాన నగరాల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరణ నిలిచిపోయింది. చెత్త తీసుకువెళ్లే ఆటోలు షెడ్లకు పరిమితమయ్యాయి. ఆటోల డ్రైవర్లు జీతాలు పెంచాలని కార్మికులతో పాటు సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి గురువారం ప్రభుత్వం చర్చలకు పిలిచింది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రి సురేశ్ ఛాంబర్‌లో చర్చలు జరగనున్నాయి.
'హామీలు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తాం - ప్రభుత్వానికి మహిళా ఉద్యోగుల హెచ్చరిక'
Workers Strike in All Districts: ప్రతిపక్ష నేతగా సీఎం జగన్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పారిశుద్ధ్య కార్మికులు రెండో రోజు ఆందోళనలు కొనసాగించారు. సమస్యలు పరిష్కరించాలని కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే సీఎం జగన్ మాత్రం బ్యాటు, బాల్‌తో ఆడుకుంటున్నారన్నారు. అనంతపురం నగరపాలిక కార్యాలయం వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు తెలుగుదేశం మద్దతు ప్రకటించింది. నంద్యాలలో మున్సిపల్ కార్మికులు హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కడప మున్సిపల్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి కార్మికులు నినాదాలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులు సమ్మెతో తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో వీధులు చెత్తమయంగా మారాయి.
మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె సైరన్ - ప్రభుత్వానికి హెచ్చరిక