polling: పెనుకొండ నగర పంచాయతీ ఎన్నిక.. పోలింగ్ ప్రారంభం - ananthapuram latest news
పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికలు ఉదయం ఏడు గంటలకే ప్రారంభమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
ప్రారంభమైన పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికలు
అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికలు ఉదయం ఏడు గంటలకే ప్రారంభమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా పోలీసులు పట్టణానికి 4 వైపులా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తం 20,584 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో.. 10,214 మంది పురుషులు, 10,368 మంది మహిళలు, 2 ఇతరులు ఉన్నారు.