భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేందుకు రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ అనంతపురం జిల్లా ముదిగుబ్బ తహసీల్దార్ అన్వర్ హుస్సేన్, వీఆర్వో చంద్రశేఖర్ రెడ్డి అనిశా అధికారులకు పట్టుబడ్డారు. రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన రైతు గోపాల్ నాయక్ నుంచి తహసీల్దార్ కార్యాలయంలో డబ్బులు తీసుకుంటుండగా.. అనిశా డీఎస్పీ కులశేఖర్ సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు.
రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, వీఆర్వో - anantapuram crime news
రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ తహసీల్దార్, వీఆర్వో.. ఏసీబీకి పట్టుబడ్డారు. భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని ఓ రైతు కోరగా.. అతని వద్ద 5 లక్షలు డిమాండ్ చేశారు. రైతు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. తహసీల్దార్ కార్యాలయంలో నగదు ఇస్తుండగా.. పట్టుకున్నారు.
bribe
రైతుకు చెందిన భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేయగా రెండు లక్షలు ఇచ్చేందుకు రైతు ఒప్పుకున్నాడు. ఇదే విషయాన్ని స్పందన కార్యక్రమం ద్వారా అనిశాకు ఫిర్యాదు చేశాడు . ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అనిశా అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:విద్యుత్ తీగలకు 24 గొర్రెలు బలి...రూ.2.5లక్షల నష్టం