అనంతపురం జిల్లా మడకశిరలో అప్పటి ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. వాటిలో కొంతమంది ఇల్లు నిర్మించుకుని జీవనం సాగిస్తుంటే.. కొంతమంది ఇళ్లను నిర్మించుకోలేక స్థలాలను ఖాళీగా ఉంచారు. ప్రస్తుత సర్కారు పేదలకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు ఖాళీగా ఉన్న ఇంటి స్థలాలను గుర్తించి వాటిలో 392 సైట్లను తొలగించారు. తొలగించిన సైట్లను చదును చేసేందుకు వెళ్లిన అధికారులను లబ్ధిదారులు అడ్డుకున్నారు. పట్టాలను తొలగించిన వారిలో ఎవరైనా అర్హులుంటే.. వారికి తిరిగి పట్టాలు మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు. అయితే పలు కారణాలతో గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాల్లో ఇల్లు కట్టుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. ముందుగా తమకు న్యాయం చేసిన తర్వాతే ఇతరులకు కేటాయించాలని కోరుతున్నారు.
మడకశిరలో ఇళ్ల పట్టాల కోసం లబ్ధిదారుల ఆందోళన - అనంతపురం జిల్లా మడకశిరలో ఇళ్ల లబ్ధిదారుల ఆందోళన వార్తలు
అనంతపురం జిల్లా మడకశిరలో నిరుపేదలకు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇంటి స్థలాలను స్వాధీనం చేసుకుంటున్న అధికారులను లబ్ధిదారులు అడ్డుకున్నారు. ముందుగా తమకు న్యాయం చేసిన తర్వాతే ఇతరులకు కేటాయించాలని కోరుతున్నారు.
![మడకశిరలో ఇళ్ల పట్టాల కోసం లబ్ధిదారుల ఆందోళన authorities were blocked by the beneficiaries at ananthapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6121947-484-6121947-1582097909456.jpg)
అధికారులను అడ్డుకున్న లబ్ధిదారులు
ఇళ్ల స్థలాలు చదును చేస్తుండగా అడ్డుకున్న లబ్ధిదారులు