అనంతపురం జిల్లా హిందూపురంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. స్థానిక ఎమ్మార్వో అందుబాటులో లేకపోవటం వల్ల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయమై కార్యాలయ సిబ్బందిని సంప్రదించగా... పెనుగొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశానికి ఎమ్మార్వో వెళ్లారని తెలిపారు. నామినేషన్లకు అత్యంత కీలకమైన సమయంలో అధికారుల సమావేశం నిర్వహించడం ఏంటని అభ్యర్థులు వాపోతున్నారు.
ఎమ్మార్వో అందుబాటులో లేక ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఇక్కట్లు - హిందూపురం ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ తాజా న్యూస్
అనంతపురం జిల్లా హిందూపురంలో కులధ్రువీకరణ పత్రం కోసం ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయితే తహసీల్దార్ అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీలక సమయాల్లో తహసీల్దార్ సమావేశాలకు వెళ్లారని వాపోయారు.
![ఎమ్మార్వో అందుబాటులో లేక ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఇక్కట్లు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6358474-348-6358474-1583836098230.jpg)
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆందోళన
కులధ్రువీకరణ పత్రం కోసం ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల తిప్పలు