ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొమ్మనలేక పొగ పెట్టారు: ఎంపీఈవోలు - mpeo demands in ananthapuram

మడకశిర నియోజకవర్గంలోని వ్యవసాయ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 24 మంది ఎంపీఈవోలను చిత్తూరు జిల్లాలో విధులు నిర్వహించాలని రిలీవ్ చేస్తూ ఆమోదిత పత్రాలను ఎంపీఈవోలకు వ్యవసాయ శాఖ అధికారి అందించారు. ఎంపీఈవోలను పొమ్మనలేక పొగ పెట్టారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

mpeo
mpeo

By

Published : Aug 4, 2020, 6:14 PM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖలో ఎంపీఈవోలుగా నియమితులయ్యాం. ప్రస్తుత ప్రభుత్వం సచివాలయాల్లో అన్ని పోస్టులతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, సిరికల్చర్ సహాయకుల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. జిల్లాలో తొమ్మిది లక్షల హెక్టార్లలో అగ్రికల్చర్ సాగు జరుగుతుంటే కేవలం 282 పోస్టులు పెట్టారు. తక్కువ సాగవుతున్న హార్టికల్చర్, అగ్రికల్చర్ కు అధిక పోస్టులు కేటాయించారు. దీంతో 6 మార్కులు వచ్చిన హార్టికల్చర్, సిరికల్చర్ వారికి ఉద్యోగం లభించింది. 60 మార్కులు సాధించిన అగ్రికల్చర్ వారికి ఉద్యోగాలు రాలేదు.

మాలో కొంతమందిని రైతు భరోసా కేంద్రాలకు మ్యాపింగ్ చేశారు. మిగిలిన వారు నిరుత్సాహం చెందక నాలుగు నెలలుగా తమ పరిధిలో ఉద్యోగ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. మాకు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. ఇప్పుడు చిత్తూరు జిల్లాకు బదిలీ చేశారు -ఎంపీఈవోలు

చిత్తూరుకు బదిలీ చేసిన వీరిని అక్కడ విధులు నిర్వహిస్తేనే బకాయి ఉన్న జీతాలు అందుతాయని చెబుతున్నారని ఎంపీఈవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు రిలీవ్ చేస్తున్నట్టు అధికారి ఆమోద పత్రం అందించారని తెలిపారు. వచ్చే కొద్దిపాటి జీతంతో అక్కడ వెళ్లి ఎలా జీవనం సాగించేదని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పొమ్మనలేక పొగ పెట్టిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ పరిస్థితిని గమనించి తమ స్వస్థలాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఎంపీఈవోలు కోరారు.

ఇదీ చదవండి:160 కోట్ల మంది విద్యార్థులపై కరోనా ప్రభావం!

ABOUT THE AUTHOR

...view details