కరోనా కట్టడికి డ్రోన్ల సేవలు కరోనా వైరస్ రెండో దశ తీవ్రరూపం దాల్చడంతో.. అనంతపురం జిల్లా హిందూపురంలో కట్టడి చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. డ్రోన్ సాయంతో హైపోక్లోరైడ్ ద్రావకాన్ని పట్టణమంతా పిచికారీ చేయించారు. ఈ యంత్రాన్ని బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్లు ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తెలిపారు.
ఇదీ చదవండి:కరోనాపై అఖిలపక్ష భేటీకి సోనియా డిమాండ్
పట్టణంలోని సద్భావం కూడలి వద్ద ఈ కార్యక్రమాన్ని.. ఎంపీ, ఎమ్మెల్సీ లాంఛనంగా ప్రారంభించారు. డ్రోన్ ద్వారా పట్టణమంతా హైపోక్లోరైడ్ పిచికారీ చేయనున్నట్లు తెలిపారు. దాదాపు రూ. కోటి ఎంపీ నిధులను తెచ్చి.. హిందూపురం పార్లమెంట్ పరిధిలోని కొవిడ్ బాధితుల చికిత్సకు ఖర్చు చేస్తామని గోరంట్ల మాధవ్ వెల్లడించారు.
ఇదీ చదవండి:
ఒకే మంచంపై మృతదేహం, బాధితుడు