Cini Stars Played Cricket In Anantapur: అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన సినీ స్టార్స్ క్రికెట్ పోటీ అనంతపురం పీటీసీ మైదానంలో సందడిగా సాగింది. సే నో డ్రగ్స్.. సే నో ప్లాస్టిక్ అనే నినాదంతో ఈ క్రికెట్ పోటీని నిర్వహించారు. క్రీసెంట్ క్రికెట్ కప్పు 20 20 అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని క్రీసెంట్ క్రికెట్ కప్పు చైర్మన్ షకీల్ షఫీ ఆధ్వర్యంలో ఈ పోటీని నిర్వహించారు. బుల్లితెర నటీనటులు క్రికెట్ ఆడి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ యాంకర్ అనసూయ అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రికెట్ పోటీల్లో ఓంకార్ జట్టు, ఆదర్శ జట్టు పాల్గొన్నాయి. ఇవీ రెండు తలపడగా ఆదర్శ జట్టు విన్నర్‌గా నిలిచింది. గెలుపొందిన ఆదర్శ జట్టును తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సన్మానించారు. అనంతరం విజేతలకు కప్పులు అందించారు.
అనంతలో సినీతారల క్రికెట్.. విన్నర్ ఎవరంటే..! - క్రికెట్ ఆడిన సినీతారలు
Cini Stars Cricket: అనంతపురంలో సినీ తారలు క్రికెట్ ఆడి సందడి చేశారు. ఈ క్రికెట్ పోటీ కార్యక్రమానికి హాజరైన వెండితెర, బుల్లితెర నటీనటులు ఆభిమానులను అలరించారు.
![అనంతలో సినీతారల క్రికెట్.. విన్నర్ ఎవరంటే..! Movie Stars Played Cricket](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16344867-480-16344867-1662914352856.jpg)
క్రికెట్ ఆడిన సినీతారలు
అనంతపురం పీటీసీ మైదానంలో క్రికెట్ ఆడి సందడి చేసిన సినీతారలు