ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిరుత దాడిలో దూడ మృతి, ఇంట్లో తిష్టవేసిన ఎలుగుబంటి - అనంతపురం జిల్లాలో చిరుత సంచారం

wild animals అటవీ జంతువులు ఇళ్లల్లోకి వచ్చే వార్తలు తరుచూ వింటూ ఉన్నాం. అడవులను నరికి వేయడం వల్ల వాటికి ఆవాసం, ఆహారం కరువై తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఓ గ్రామంలో ఆవు దూడను చిరుత చంపగా, మరో ఊరిలో ఎలుగుబంటి ఏకంగా ఇంట్లోనే తిష్ట వేసింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 27, 2022, 5:22 PM IST

Chestha attack: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇటీవల అడవి జంతువుల బెడద అధికమైంది. పలుచోట్ల పశువులు, మేకలపై చిరుత దాడి చేస్తోంది. మరోవైపు ఎలుగుబంట్లు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వివిధ సంఘటనలల్లో ప్రజలను గాయపరిచిన ఘటనలు అధికమవుతున్నాయి. తాజాగా కంబదూరు మండలం జల్లిపల్లి గ్రామంలో ఎర్రప్పఅనే రైతుకు చెందిన స్థలంలో కట్టి ఉంచిన ఆవు దూడపై చిరుత దాడి చేసి తినేసింది. మరోవైపు పరమసముద్రం మండల కేంద్రంలో పాడుబడిన ఇంట్లో ఎలుగుబంటి తిష్ట వేసింది. దానిని గుర్తించిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కళ్యాణదుర్గం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు.. ఆ ఎలుగుబంటి విశ్రాంతి కోసం ఆ ఇంట్లోకి ప్రవేశించి ఉంటుందని తెలిపారు. తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపిస్తామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details