అనంతపురం జిల్లా కణేకల్ మండలం నల్లంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల బాలుడి అనుమానస్పద స్థితిలో శవమై కనిపించాడు. బాలుడి హ్యత్యకు పెద్దమ్మే కారణమని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
నీటి కుంటలో శవమై తేలిన మూడేళ్ల బాలుడు.. ఆస్తి వివాదమే కారణమా ? - బాలుడిని నీటి తొట్టిలో వేసిన తల్లి
11:38 December 31
నీటి కుంటలో శవమై తేలిన మూడేళ్ల బాలుడు.. ఆస్తి వివాదమే కారణమా ?
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లంపల్లికి చెందిన నగేశ్, సురేశ్ ఇద్దరూ అన్నదమ్ములు. వీరికి 12 ఎకరాల పొలం ఉంది. ఆస్తి పంపకాల్లో తేడాలు రావటంతో గత కొద్దిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సురేశ్ మౌనిక దంపతులకు మూడేళ్ల కుమారుడు, ఓ కూతురు ఉంది. గత రాత్రి మౌనిక బాలుడికి పాలు పట్టించి ఉయ్యాలలో పడుకోబెట్టింది. వేకువజామున లేచి చూడగా.. బాలుడు కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన మౌనిక.. భర్త సురేశ్‌తో కలిసి ఇంటి పరిసరాల్లో గాలించారు. గ్రామ సమీపంలోని నీటి కుంటలో బాలుడి శవాన్ని గుర్తించారు.
ఆస్తి గొడవల కారణంగా అన్న నగేశ్ భార్య లలితమ్మ బాలుడుని గొంతు నులిమి చంపి నీటి కుంటలో పడేసినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా.. అనుమానితురాలు లలితమ్మ పరారీలో ఉండటం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి
Son Killed Mother: డబ్బు, బంగారం తీసుకుని.. తల్లిని చంపిన కొడుకు