ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేగుబంధాన్ని మరచి... రెండు రోజుల చిన్నారిని చెత్తబుట్టలో పడేసిన తల్లి - child in a trash can

Anantapur: పిల్లలు పుట్టలేదని గుళ్లు, గోపురాలు ఆసుపత్రుల చుట్టూ తిరిగే వారిని చూస్తుంటాం.. కానీ పుట్టిన రెండు రోజుల చిన్నారిని చెత్తబుట్టిలో వేసిన.. హృదయ విదారక ఘటన.. అనంతపురంలో చోటు చేసుకుంది.

Anantapur
పేగుబంధాన్ని మరచి... రెండు రోజుల చిన్నారిని చెత్తబుట్టలో పడేసిన తల్లి

By

Published : Jan 15, 2023, 4:35 PM IST

Anantapur: పిల్లలు పుట్టలేదని గుళ్లు, గోపురాలు ఆసుపత్రుల చుట్టూ తిరిగే వారిని చూస్తుంటాం.. కానీ పుట్టిన రెండు రోజుల చిన్నారిని చెత్తబుట్టలో వేసిన అమానుష ఘటన... అనంతపురంలో చోటు చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన చూస్తే మనసు చలించిపోతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్నారులతో సందడిగా కళకళలాడుతున్న ఇళ్లను చూస్తుంటాం. కానీ ఓ తల్లికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ అభం శుభం తెలియని రెండు రోజుల చిన్నారిని(పాప) చెత్తబుట్టలో పడేసింది. అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న ఏటీఎం కేంద్రం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి ఏడుపు విని.. చూసిన స్థానికులు రెండో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు చిన్నారిని అక్కున చేర్చుకొని ప్రభుత్వాసుపత్రిలోని చిన్నారి సంరక్షణ కేంద్రంలో ఉంచారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు అయితే చిన్నారిని చెత్తబుట్టిలో ఎవరు వేశారని విచారణ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details