ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తల్లిని వదిలేసిన తనయులు.. పోలీసులు కౌన్సిలింగ్​ - mother suffering from her sons at anantapuram district news

బిడ్డల ఎదుగుదలే తన భవిష్యత్​గా భావించి జీవితాన్ని ఇచ్చిన తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అలాంటి మాతృమూర్తికి వృద్ధాప్యంలో తోడుగా ఉండాల్సిన బిడ్డలు నిర్ధాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉన్నాం. అనంతపురంలో మాత్రం ఇలాంటి సంఘటన గురించి తెలుసుకున్న సీఐ.. చూస్తూ ఊరుకోలేదు. ఆ తల్లి కన్నబిడ్డను పిలిచి కౌన్సిలింగ్​ ఇచ్చారు.

mother suffering from her sons
తల్లిని గాలికొదిలేసిన తనయులు

By

Published : Nov 17, 2020, 11:19 AM IST

Updated : Nov 17, 2020, 2:10 PM IST

అనంతపురం జిల్లా జన్మభూమి రోడ్డులో నాగమ్మ అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు. భర్త 30 ఏళ్ల కిందటే మరణించాడు. దీంతో ఒంటరైన నాగమ్మ.. కుమారుల ఎదుగుదలే తన భవిష్యత్​గా బతికింది. ఇద్దరు కుమారులను చదివించి, పెళ్లిళ్లు చేసింది. ఇద్దరు ప్రైవేట్​ రంగంలో ఉద్యోగం చేస్తూ భార్యబిడ్డలతో సంతోషంగా ఉన్నారు. ఇంతవరకు భాగానే ఉంది. ఆ తల్లి.. వయస్సు మీద పడటం, పని చేయలేని పరిస్థితికి చేరింది. ఇంకేముంది.. కుమారుల నిజస్వరూపాలు బయటపడ్డాయి. ఇద్దరు కూడా నా దగ్గర వద్దంటే.. నా దగ్గర వద్దంటూ తల్లిని గాలికొదిలేశారు. దీంతో ఆరు బయటే ఉంటూ.. తినడానికి తిండి లేక అలమటించిందా తల్లి.

విషయం తెలుసుకున్న నాలుగో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు ఆమె పరిస్థితి చూసి చలించిపోయారు. వృద్ధురాలి వద్దకు ఇద్దరు కానిస్టేబుళ్లను పంపించి పరిస్థితిపై ఆరా తీశారు. 30 ఏళ్ల కిందట భర్త చనిపోతే పిల్లలను పెంచి పెద్ద చేసానని.., వారికి పెళ్లై, పిల్లలు పుట్టాక.. తన కుమారులు తనను పట్టించుకోవడం లేదంటూ నాగమ్మ కన్నీటి పర్యంతమైంది. స్పందించిన సీఐ శ్రీనివాసులు.. నాగమ్మ పెద్ద కుమారుడిని పిలిపించి కౌన్సిలింగ్​ ఇచ్చారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని మంచిగా చూసుకోవాలని, లేకుంటే కేసు నమోదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం కుమారుడితోపాటు నాగమ్మను ఇంటికి పంపించారు. సీఐ శ్రీనివాసులు తీసుకున్న చొరవకు స్థానికులు అభినందించారు.

Last Updated : Nov 17, 2020, 2:10 PM IST

ABOUT THE AUTHOR

...view details