కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని మైలవరం మండలం గొల్లపల్లె గ్రామంలో నాలుగు నెలల చిన్నారిని నీటి కుంటలో పడేసిందా తల్లి. పాపకు ఆరోగ్యం బాగాలేదని.. హాస్పిటల్కు తీసుకువెళ్తున్నానని ఇంట్లోవాళ్లకు చెప్పిన ఆమె.. మైలవరం మండలం గొల్లపల్లె గ్రామం వద్ద నీటి కుంటలో కుమార్తె జోష్నను పడేసి కడతేర్చింది. అనంతరం.. పాపను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. అనుమానంతో ఆరా తీసిన పోలీసులు... కొన్ని గంటల వ్యవధిలోనే చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. భర్త రోజూ హింసించడం తట్టుకోలేక తనూ చనిపోవాలి అనుకుని... చివరికి పాపను చంపానని పోలీసులకు చెప్పింది. సుభాషిణిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కన్న తల్లే కడతేర్చింది.. కిడ్నాప్ డ్రామా ఆడింది - కడప జిల్లా మైలవరం మండలం గొల్లపల్లె గ్రామంలోకన్న బిడ్డను కడతేర్చిన తల్లి వార్తలు
కంటికి రెప్పలా.. కాపాడాల్సిన తల్లే కడతేర్చింది. కడప జిల్లా మైలవరం మండలం గొల్లపల్లె గ్రామంలో నాలుగు నెలల చిన్నారిని నీటిలో పడేసింది. అనంతరం పాపను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని పిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆరా తియ్యగా అసలు విషయం బయటపడింది.
![కన్న తల్లే కడతేర్చింది.. కిడ్నాప్ డ్రామా ఆడింది the mother murderd her 4 months old baby](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5407472-372-5407472-1576604955756.jpg)
కన్న తల్లే.. కడతేర్చింది