అనంతపురం జిల్లా ధర్మవరంలోని కొత్తపేటలో దారుణం చోటుచేసుకుంది. రెండున్నరేళ్ల చిన్నారిని తల్లి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మీనాక్షి, శ్రీనివాసులు దంపతులు స్థానిక కొత్తపేట కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. శ్రీనివాసులు చేనేత పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతుల మధ్య గత కొంతకాలంగా చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం శ్రీనివాసులు, పెద్ద కుమార్తె తనుశ్రీ బయటకు వెళ్లారు.
ధర్మవరంలో దారుణం.. కూతురిని చంపి ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి! - అనంతపురం జిల్లా ప్రధాన వార్తలు
13:37 August 13
రెండున్నరేళ్ల చిన్నారిని హతమార్చి ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి
అదే సమయంలో మీనాక్షి.. చిన్న కుమార్తె ప్రణతి(2)ని కత్తితో దారుణంగా హత్య చేసి ఆపై ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు వెంటనే భర్త శ్రీనివాసులుకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న శ్రీనివాసులు మీనాక్షిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ధర్మవరం పట్టణ సీఐ కరుణాకర్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
TDP COMPLAINT: 12 రోజుల్లోనే 50 ఖాళీ జీవోలు ఎందుకిచ్చారు: తెదేపా