అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక.. స్థానికంగా నివాసముంటున్న ఓ అబ్బాయి ప్రేమించుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు వారిని ఇంటికి పిలిపించారు. తమ కుమారునితో చనువుగా ఉంటూ... తమకు తెలియకుండా పెళ్లి చేసుకుంటావా అంటూ ఆ బాలికను అబ్బాయి తల్లి మందలించింది.
ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటకు మాట పెరగి గొడవపడ్డారు. కోపంతో ఉన్న అబ్బాయి తల్లి కత్తితో అమ్మాయిని బలంగా పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల బాలికను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.