కుటుంబ కలహాలతో ఐదేళ్ల కుమారుడుని బావిలో తోసి ఓ మహిళ తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా మడకశిర మండలం కరేసంకపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రాధమ్మ ,పాండు రంగప్ప భార్యభర్తలు.. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది. ఉదయం పాండు రంగప్ప మేస్త్రీ పనికి బయటకు వెళ్లగా... సంవత్సరం వయస్సున్న చిన్న కుమారుడిని ఇంట్లో వదిలి..ఐదేళ్ల వయస్సున్న తన పెద్దకొడుకుతో రాధమ్మ గ్రామ సమీపంలోని బావి వద్దకు వెళ్లింది.
కుమారుడిని బావిలో తోసి తానూ దూకేసిన తల్లి ! - కుమారుడిని బావిలో తోసి..తాను దూకేసిన తల్లి
కుటుంబ కలహాలతో ఐదేళ్ల కుమారుడుని బావిలో తోసి ఓ మహిళ తాను ఆత్మహత్యకు పాల్పడన ఘటన అనంతపురం జిల్లా కరేసంకపల్లి గ్రామంలో జరిగింది. ఘటనలో కుమారుడు చనిపోగా...తల్లి ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్సపొందుతుంది.
కుమారుడిని బావిలో తోసి తాను దూకేసిన తల్లి !
కుమారుడిని బావిలోకి తోసి అనంతరం తానూ దూకేసింది. గమనించిన స్థానికులు వారిని బయటకు తీశారు. ప్రాణపాయస్థితిలో ఉన్న రాధమ్మ ఆసుపత్రికి తరలించగా... బాలుడు అప్పటికే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.