ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివాహానికి హాజరై వస్తుండగా ప్రమాదం.. తల్లీ కొడుకు మృతి - ananthapuram accidents news

బంధువుల వివాహానికి హాజరైన ఆ తల్లీ కొడుకులు సంతోషంగా స్వగ్రామానికి బయలుదేరారు. ఇంతలో మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం ఆ ఇంట తీవ్ర విషాదం నింపింది. అనంతపురం జిల్లా వజ్రకరూర్​ మండలం రాగులపాడులో జరిగిన ఘటన వివరాలివి..!

వివాహానికి హాజరై వస్తుండగా ప్రమాదం.. తల్లీ కొడుకు మృతివివాహానికి హాజరై వస్తుండగా ప్రమాదం.. తల్లీ కొడుకు మృతి
వివాహానికి హాజరై వస్తుండగా ప్రమాదం.. తల్లీ కొడుకు మృతి

By

Published : Jul 30, 2020, 4:47 PM IST

అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం రాగులపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్​ను లారీ ఢీ కొన్న ఘటనలో తల్లీ కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. గుంతకల్​ మండలం గుండాల తండాకు చెందిన కృష్ణనాయక్​, తులసమ్మ ఇద్దరూ పీసీ ప్యాపిలి గ్రామంలో బంధువు వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లారు. శుభకార్యం పూర్తి కాగానే బైక్​పై తన స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి తల్లీ కొడుకు చనిపోవడం అందరినీ కలిచివేసింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details