అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉదయపు నడకకు వెళ్ళిన వారిని పోలీసులు సున్నితంగా హెచ్చరించారు. పట్టణంలో రోడ్ల వెంట, కళాశాల ప్రాంగణంలో నడుస్తున్న పలువురిని ఆపి సూచనలిచ్చారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. బయటకు వచ్చేటప్పుడు కచ్చితంగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కరోనా విజృంభిస్తున్న వేళ... ఉదయపు నడక ఏల? - కళ్యాణదుర్గం వార్తలు
కరోనా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం నిబంధనలు విధించినా... కొందరు వాటిని బేఖాతరు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తూ పోలీసులకు ఆసౌకర్యం కలిగిస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉదయపు నడక కోసం బయటకు వచ్చిన వారిని... పోలీసులు అడ్డుకున్నారు.
ఉదయపు నడక చేస్తున్న వారిని అడ్డుకున్న పోలీసులు