నెల్లూరు జిల్లాలో...
కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అమలు చేస్తున్న 18 గంటల కర్ఫ్యూ మూడోరోజుకు చేరింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నెల్లూరు నగరంలో కర్ఫ్యూ కట్టుదిట్టంగా అమలవుతోంది. నగరంలో 33 ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేసిన పోలీసులు, రాకపోకలను నియంత్రిస్తున్నారు.
ప్రకాశం జిల్లా...
ఒంగోలు పట్టణంలో పగటి కర్ఫ్యూ దృష్ట్యా... ప్రజలు బయట తిరగకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తున్నారు. అకారణంగా రోడ్లపైకి వస్తే ఊరుకునేది లేదని చీరాల రెండో పట్టణ సీఐ పాపారావు హెచ్చరించారు. పట్టణంలోని పేరాల వాడరేవు కూడలిలో సీఐ ఆధ్వర్యంలో పికిటింగ్ ఏర్పాటు చేశారు.
అనంతపురం జిల్లాలో...
కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన దాదాపు లక్ష మందిపై కేసులు నమోదు చేశామని అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు. దుకాణదారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయడం అభినందనీయమన్న ఆయన... అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విశాఖపట్నం జిల్లాలో...