ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధర్మవరంలో పెరిగిన కేసులు..నియంత్రణకు అధికారుల చర్యలు​ - కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టిన అధికారులు వార్తలు

అనంతపురం జిల్లా ధర్మవరంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. పట్టణంలో కట్టుదిట్టంగా లాక్​డౌన్​ అమలు చేస్తూనే.. అకారణంగా రోడ్లపైకి వచ్చిన వారికి కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

more-corona-cases-recorded-at-anantapuram
అనంతలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం

By

Published : Jul 19, 2020, 8:27 PM IST

ధర్మవరంలో కరోనా కట్టడికి పోలీసులు చర్యలు చేపట్టారు. పట్టణంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 541కు చేరడం.. వ్యాధి నివారణకు అధికార యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టింది. ఈనెల 30 వరకు పలు ఆంక్షలు అమలు చేస్తూ.. మున్సిపల్ అధికారులు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

ఉదయం 9 గంటలు దాటిన తర్వాత ప్రజలు బయటకు రావద్దని, నిబంధనలు ఉల్లంఘించి రహదారుల పైకి వచ్చేవారికి కఠిన శిక్షలు తప్పవని పోలీసులు వెల్లడించారు. సీఐ కరుణాకర్ పట్టణంలోకి వచ్చే రహదారులు మూసి వేయించారు. దుకాణాలు రోజు విడిచి రోజు తెరిచే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details