పిల్ల వానరం మృతి... విషాదంలో తల్లి - monkey tragedy at kalyanadurgam
ఓ పిల్ల వానరం మృతి చెందటంతో దాని తల్లి, ఇతర వానరాలు విషాదంలో మునిగాయి. కళ్యాణదుర్గంలో జరిగిన ఈ ఘటన స్థానికులను కంటతడికి గురిచేసింది.
పిల్ల వానరం మృతితో విషాదంలో తల్లి వానరం
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని పార్వతీనగర్ లో ఓ పిల్ల కోతి మృతి చెందింది. ఆ పిల్ల కోతిని విడవకుండా తల్లి కోతి అదే కాలనీలో తిరగటం, ఆ ప్రాంతవాసులకు కన్నీరు తెప్పించింది. ఉదయం నుంచి సాయంకాలం వరకు... మృతి చెందిన కోతి పిల్లను లాక్కుంటూ తిరిగి... తల్లి ప్రేమకు అద్దం పట్టింది.