వానరమైన అమ్మే కదా.. బుడిబుడి అడుగులు వేస్తూ తల్లి వానరం వెంట తిరిగే పిల్ల వానరం చెట్టు పై నుంచి కింద పడి మృతి చెందింది. మూడు రోజుల క్రితం మృతి చెందిన పిల్ల వానరాన్ని.. తల్లి వానరం వదలకుండా పొత్తిళ్ళలో పెట్టుకొని తిరుగుతూ ఉండటం చూసినవారికి కన్నీళ్లొచ్చాయి.
చనిపోయిన పిల్లను మోస్తూ తిరుగుతున్న వానరం.. తల్లి వేదన వర్ణనాతీతం - అనంతపురం జిల్లా తాజా వార్తలు
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలో పిల్లవానరం చెట్టు పై నుంచి కింద పడి మృతి చెందింది. మూడు రోజులైన పిల్లవానరాన్ని.. తల్లి వానరం వదలకుండా పొత్తిళ్లలో పెట్టుకుని తిరుగుతోంది. ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టించింది.
పిల్ల వానరం మృతి
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. మూడు రోజుల క్రితం చెట్టు పై నుంచి పిల్ల వానరం కిందపడి చనిపోయింది. తోటి వానరాలు అక్కడికి చేరుకొని పిల్ల వానరం మృతిచెందిన విషయం తెలుసుకొని కొంతసేపు అక్కడ ఉండి వెళ్లిపోయాయి. బిడ్డపై ప్రేమ వదులుకోలేని తల్లి వానరం మాత్రం పిల్ల మృతదేహాన్ని వదిలిపెట్టకుండా వీధులలో తిరుగుతూనే ఉంది.
ఇదీ చదవండి: