ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యానికి డబ్బులు లేక... చేనేత కార్మికుడు బలవన్మరణం - అనంతపురం జిల్లా వార్తలు

అనారోగ్యానికి గురైన చేనేత కార్మికుడు వైద్యం చేయించుకునేందుకు... డబ్బులు లేక ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది.

Money for medical care or  handloom worker forced death at ananthapur district
వైద్యానికి డబ్బులు లేక...చేనేత కార్మికుడు బలవన్మరణం

By

Published : Dec 3, 2020, 10:58 AM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో వైద్యానికి డబ్బులు లేక ఉరివేసుకొని చేనేత కార్మికుడు చిట్టా రామకృష్ణ మృతి చెందాడు. పట్టణంలోని శాంతినగర్​కు చెందిన రామకృష్ణ.. మగ్గం కార్మికుడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడ్డాడు. పని చేయలేక ఇంట్లోనే ఉన్నాడు. ఆర్థిక సమస్యలతో వైద్యం చేయించుకోలేకపోయాడు.

ఇంటి నుంచి బయటకు వెళ్లి రైల్వే గేట్​ వద్ద షెడ్డులో ఉన్న దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని రామకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details