రాష్ట్రవ్యాప్తంగా మొహర్రం వేడుకలు ప్రారంభమయ్యాయి. మతాలకు అతీతంగా ఈ వేడుకల్లో ప్రజలందరూ పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మొహర్రం వేడుకలు కడప జిల్లాలో..
రైల్వేకోడూరు నియోజకవర్గంలో నేడు మొహర్రం (పీర్ల పండుగ) సందర్భంగా నియోజకవర్గంలోని కోడూరు, ఓబులవారిపల్లి, చిట్వేలి మండలాల్లో ముస్లింలు, హిందువులు కలసి ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో అగ్నిగుండ ప్రవేశం ఘనంగా నిర్వహించారు. అగ్నిగుండంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో..
ఉరవకొండ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మొహర్రంను ముస్లింలు, హిందువులు ఘనంగా జరుపుకున్నారు. పూర్వీకుల త్యాగాలను గుర్తుకు తెచ్చుకుంటూ.. మతాలకు అతీతంగా హిందూ ముస్లింలు పీర్లకు బెల్లం, చక్కెర సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వివాదాస్పద గ్రామాల్లో పోలీసులు తిరుగుతూ ఎటువంటి ఆవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
కొవిడ్ నిబంధనలు అమల్లో ఉండడంతో తప్పెట్లు కొట్టుకోవడానికి ఎవరికీ అనుమతి ఇవ్వకపోవడంతో గతంలో ఉన్న ఉత్సాహం లేకుండా పోయిందని ప్రజలు అంటున్నారు.
ఇదీ చదవండి