అనంతపురం నగరపాలక సంస్థ పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నగరపాలక సంస్థ మేయర్గా మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్గా వాసంతి సాహిత్య ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. నగరపాలక సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సమక్షంలో.. మేయర్, డిప్యూటీ మేయర్లతోపాటు 50 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి.. పాలకమండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నగర అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. నగరాభివృద్ధికి తవ వంతు బాధ్యతగా పనిచేస్తామని కార్పొరేటర్లు అన్నారు.