ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పేదలందరికీ ఇళ్లు'.. ఇదిగో మాదిరి గృహం వీడియో..! - అనంతపురం జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీ వివరాలను వెల్లడించిన కలెక్టర్

ఈనెల 25వ తేదీన అనంతపురం జిల్లాలో 2 లక్షల 3 వేల ఇళ్ల పట్టాలను ప్రజలకు అందిచనున్నట్లు కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు. 'పేదలందరికీ ఇళ్లు'లో భాగంగా ఇవ్వనున్న మాదిరి గృహం వీడియోను ఆయన విడుదల చేశారు.

houses to poor
సమావేశంలో మాట్లాడుతున్న అనంతపురం కలెక్టర్

By

Published : Dec 10, 2020, 8:19 PM IST

'పేదలందరికీ ఇళ్లు'లో భాగంగా ఈ నెల 25వ తేదీన.. 2 లక్షల 3 వేల ఇళ్ల పట్టాలను ప్రజలకు పంపిణీ చేయనున్నట్లు అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. లక్షా 11 వేల స్థలాల్లో ఇళ్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం నిర్మించనున్న ఇంటి వీడియో దృశ్యాలను విడుదల చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న అనంతపురం కలెక్టర్

రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల స్థలాల పంపిణీని ప్రభుత్వం చేపడుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇంత పెద్దఎత్తున పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం ఎక్కడా జరగలేదన్నారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు అందించడానికి వాటిని సిద్ధంగా ఉంచామని వివరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details