ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుట్లూరు పీఎస్​ ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకుల ధర్నా

అనంతపురం జిల్లా గోపరాజుపల్లిలో ఓ ప్రేమ వ్యవహరంలో యువకుడి బంధువులను పోలీసులు అరెస్టు చేశారు. తమ వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఎమ్మార్పీఎస్ నాయకులు పీఎస్ ఎదుట ఆందోళన చేశారు.

పుట్లూరు పీఎస్​ ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా
పుట్లూరు పీఎస్​ ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా

By

Published : Jul 29, 2020, 11:04 PM IST

అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గోపరాజుపల్లిలో ఓ ప్రేమ వ్యవహరంలో యువకుడి బంధువులను అరెస్టు చేశారు. ఆ గ్రామానికి చెందిన రఘుపతి తన సమీప బంధువైన అమ్మాయిని ప్రేమించాడు. అయితే అమ్మాయి మైనర్ కావటంతో వివాహం చేసుకోలేదు. బాలిక తల్లిదండ్రులు ఆమెను వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు.

వివాహం తర్వాత బాలిక భర్తతో కాపురం చేయలేదు. దీంతో బాలిక తల్లి అడిగి విషయం తెలుసుకుంది. బాలిక ప్రేమించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు రఘుపతిని అరెస్టు చేయాటానికి వెళ్లగా బంధువులు, మరికొంతమంది ఎమ్మార్పీఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఉదయాన్నే రఘుపతిని పోలీసుస్టేషనికు తీసుకువస్తామని చెప్పారు. దీంతో పోలీసులు వెనుదిరిగారు. ఉదయానికి రఘుపతి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు తల్లిదండ్రులతో సహా మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఎమ్మార్పీఎస్ నాయకులు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. తమ వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆందోళన చేశారు. పోలీసులు, ఎమ్మార్పీయస్ నాయకుల మధ్య వివాదం జరిగింది. తమ వారిని వదిలేయాలని వారు డిమాండ్ చేశారు. యువకుడిని తీసుకువస్తేనే మిగిలిన వారిని వదలేస్తామని పోలీసులు తేల్చిచెప్పారు. బాలిక మైనర్ అయినా తల్లిదండ్రులు వివాహం చేశారని వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

పుట్లూరు పీఎస్​ ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా

ఇవీ చదవండి

ఆందోళనకు దిగిన కరోనా అనుమానితులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details