ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి పదవి నుంచి జయరాం​ను తొలగించాలి: తిప్పేస్వామి - జగన్​పై ఎమ్మెల్సీ తిప్పేస్వామి కామెంట్స్

ఈఎస్ఐ స్కాంతో సంబంధమున్న మంత్రి జయరాం​ను మంత్రి పదవి నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి డిమాండ్ చేశారు. 16 నెలల నుంచి హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

mlc thippeswamy comments on jagan
mlc thippeswamy comments on jagan

By

Published : Sep 19, 2020, 4:48 PM IST

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో తెదేపా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న.. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. 16 నెలల నుంచి హిందూ దేవాలయాలపై, రథాలపై దాడులు జరుగుతున్నాయని తిప్పేస్వామి విమర్శించారు. నిన్న కళ్యాణదుర్గంలో ఆంజనేయస్వామి విగ్రహాలను ధ్వంసం చేశారని తెలిపారు. దాడులు జరిపిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించడం లేదని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం దేవాలయాలను రక్షించడంలో దృష్టి సారించక ప్రశ్నించే అచ్చెన్నాయుడు లాంటి నేతలను జైలుకు పంపిస్తున్నారన్నారు.

ఈఎస్ఐ స్కాంతో సంబంధమున్న మంత్రి జయరాంపై మాత్రం ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలు తీసుకోలేదని తిప్పేస్వామి అన్నారు. ఇప్పటికైనా మంత్రి పదవి నుంచి జయరాం​ను తొలగించాలన్నారు. ఈ సంవత్సరం వేరుశెనగ పంట పూర్తిగా నష్టపోయిందని.. నష్టాన్ని అంచనా వేసి... రైతులకు అందించాలని ఈరన్న ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చదవండి:తిరుమలలో అన్యమతస్థులకు డిక్లరేషన్‌ అక్కర్లేదు: తితిదే ఛైర్మన్

ABOUT THE AUTHOR

...view details