అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో రెడ్‌జోన్ తొలగించబడిన ప్రాంతాల్లో తెదేపా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రజలకు నిత్యావసర సరుకులు పంచిపెట్టారు.శ్రీ గుండుమల వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్యపేటలో ఉన్న 411 పేద కుటుంబాలకు సరకులు పంపిణీ చేశారు.
తమ కష్టాలు తెలుసుకొని నిత్యావసరాలు అందించినందుకు ఎమ్మెల్సీకి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి రూ. 5 వేలు అందించి ఆదుకోవాలని తిప్పేస్వామి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీతో పాటు మాజీ ఎమ్మెల్యే ఈరన్న, ఎస్సై రాజేష్ తదితరులు పాల్గొన్నారు.