ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బిహార్​కు మించి రాష్ట్రంలో అరాచక పాలన: దీపక్ రెడ్డి

తెదేపా నేత జేసీ ప్రభాకర్​పై కక్ష పూరితంగా కేసులు పెడుతున్నారని ఎమ్మెల్సీ దీపక్​ రెడ్డి ఆరోపించారు. జేసీని పరామర్శించేందుకు వెళ్లగా అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. వారి తీరుపై దీపక్ రెడ్డి మండిపడ్డారు.

mlc deepak reddy
mlc deepak reddy

By

Published : Aug 7, 2020, 7:28 PM IST

ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే శాంతి భద్రతలు ఉన్నాయా అనే అనుమానం కలుగుతోందని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అన్నారు. బిహార్​కు మించి రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను శుక్రవారం అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఉంచిన సమయంలో... వారిని కలిసేందుకు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వెళ్లారు. అయితే ఆయనను స్టేషన్​లోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామంతో పోలీసుల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

శాసనమండలి సభ్యుడితో పోలీసులు ఇలా ప్రవర్తిస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని దీపక్​ రెడ్డి అన్నారు. ఇప్పటికే జేసీ ప్రభాకర్​ రెడ్డి, అస్మిత్ రెడ్డిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని... తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details