ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు అన్యాయం చేస్తున్నారంటూ... వ్యవసాయ అధికారులపై ఎమ్మెల్యేల ఆగ్రహం - Minister Botsa Satyanarayana warned the Agriculture Jedi

అనంతపురం జిల్లాలో(MLAs fire on crop loss report of agriculture jd) వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు అధికారులు అన్యాయం చేస్తున్నారంటూ.. వైకాపా, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లకుండానే ప్రభుత్వానికి అంచనా లెక్కలు పంపుతున్నారని ధ్వజమెత్తారు. అక్రమాలను అరికట్టడంలో జిల్లా వ్యవసాయ జేడీ విఫలమయ్యారంటూ విరుచుకుపడ్డారు.

MLAs reaction on cross loss report of anantapur
మంత్రి బొత్స సత్యనారాయణ

By

Published : Nov 28, 2021, 4:28 AM IST

Updated : Nov 28, 2021, 6:28 AM IST

రైతులకు అన్యాయం చేస్తున్నారంటూ... వ్యవసాయ అధికారులపై ఎమ్మెల్యేల ఆగ్రహం

MLAs fire on Agriculture Jedi: అనంతపురం జిల్లాలో వర్షాలు మిగిల్చిన నష్టాలపై... జిల్లా ఇన్‌ఛార్జి, మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం వాడీవేడిగా(Minister Botcha Satyanarayana review on damage road) సాగింది. జిల్లా వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ.. వైకాపా ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తెలుగుదేశం శాసనసభ్యులు పయ్యావుల కేశవ్ ఆగ్రహం(mlas fire on agriculture reports of crop damage in Anantapur) వ్యక్తం చేశారు.

ఈ-క్రాప్(E-CROP) చేయకుండా రైతులకు పరిహారం ఎలా ఇస్తారన్న పయ్యావుల ప్రశ్నకు.. వ్యవసాయశాఖ జేడీ నుంచి సమాధానం రాలేదు. అధికారుల తీరు సరిలేదంటూ అనంత వెంకటరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పప్పుశనగ సాగుచేస్తే..సగం విస్తీర్ణమే చూపడం ఏంటంటూ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అధికారులను నిలదీశారు. క్షేత్రస్థాయికి వెళ్లకుండా పంట నష్టం అంచనాలు వేస్తే ఇలానే ఉంటుందంటూ మంత్రి బొత్స దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. అధికారులు తీరు మార్చుకోవాలని వ్యవసాయశాఖ జేడీని మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botcha Satyanarayana warned to Agriculture Jedi) హెచ్చరించారు. తక్షణమే సమగ్ర వివరాలతో నివేదిక పంపాలని ఆదేశించారు.

ఇదీ చదవండి..BUILDING COLLAPSE: తిరుపతిలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. పరుగులు తీసిన స్థానికులు

Last Updated : Nov 28, 2021, 6:28 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details