అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాలలోని కొవిడ్ విభాగంలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులను ఎమ్మెల్యే సిద్దారెడ్డి పరామర్శించారు. వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ ధైర్యంగా ఉంటే కరోనాపై విజయం సాధించవచ్చన్నారు.
అక్కడ కోవిడ్ పాజిటివ్ బాధితులకు అందుతున్న సేవలు, సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. నర్సుల దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో సేవలందిస్తున్న సిబ్బందికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.