ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్హులైన వారందరికీ ఇంటి స్థలం: ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి - ఇంటి స్థలాల పంపిణీపై ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి

గతంలో టిడ్కో ఇంటి కోసం డబ్బు చెల్లించిన లబ్ధిదారులకు సొమ్ము వెనక్కి ఇచ్చి ఇంటి స్థలం పట్టా ఇస్తామని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఇంటి స్థలం లేని 33,067 మంది పేదలకు పట్టాలిస్తున్నామన్నారు.

అర్హులైన వారందరికీ ఇంటి స్థలం
అర్హులైన వారందరికీ ఇంటి స్థలం

By

Published : Dec 19, 2020, 4:40 PM IST

గత ప్రభుత్వంలో టిడ్కో ఇంటి కోసం డబ్బు చెల్లించిన లబ్ధిదారులకు సొమ్ము వెనక్కి ఇచ్చి ఇంటి స్థలం మంజూరు చేస్తున్నట్లు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ మూర్తితో కలిసి నియోజకవర్గంలో మంజూరైన ఇళ్ల పట్టాల వివరాలను వెల్లడించారు. గతంలో మాదిరి ఇంటి పట్టాలు ఇచ్చి వదిలేయకుండా...కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో ఇంటి స్థలం లేని 33,067 మంది పేదలకు పట్టాలిస్తున్నామన్నారు.

గతంలో టిడ్కో ఇంటి కోసం డబ్బు చెల్లించిన 2,304 మంది లబ్ధిదారులకు సొమ్ము వెనక్కి ఇచ్చి.. ఇంటి స్థలం పట్టా ఇస్తామన్నారు. టిడ్కోకు డబ్బు చెల్లించిన వారెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. అర్హులైన వారందరికీ ఇంటి స్థలం ఇస్తామన్నారు. స్థలం మంజూరు కానివారు తమ దృష్టికి తీసుకొస్తే లబ్ధి చేకూర్చుతామని కమిషనర్ మూర్తి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details