వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌ను వైకాపా కార్యాలయంలో తయారు చేశారని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. విజయసాయిరెడ్డి కనుసన్నలలో రూపుదిద్దుకున్న వీఎంఆర్డీఏ ప్రణాళికను రద్దుచేసి.. కొత్తది తయారు చేయాలని డిమాండ్ చేశారు. విధ్వంసకర మాస్టర్ ప్లాన్ వల్ల 30 వేల మధ్య తరగతి వారి ప్లాట్లు కనుమరుగవుతాయని మండిపడ్డారు. ఒకే రహదారికి ఒక్కో చోట ఒక్కో విస్తీర్ణం ఉండడం ఏంటని ప్రశ్నించారు. ప్రజామోదయోగ్యమైన ప్రణాళిక రూపొందించకుంటే.. న్యాయస్ధానాన్ని అశ్రయించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే వెలగపూడి హెచ్చరించారు.
విజయసాయిరెడ్డి కనుసన్నలలో వీఎంఆర్డీఏ ప్లాన్ : ఎమ్మెల్యే వెలగపూడి - విశాఖ తాజా వార్తలు
వీఎంఆర్డీఏ ప్లాన్‌ను వైకాపా కార్యాలయంలో తయారు చేశారని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విమర్శించారు. ఈ పాత ప్రణాళికను రద్దుచేసి నూతన ప్లాన్ తయారు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు