అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో స్థానిక వైకాపా ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ప్రజలకు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మూడు రకాల ప్లాస్టిక్ చెత్త బుట్టలను ప్రజలకు అందించారు. సీఎం జగన్ పాలన ఎలా ఉందని... ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే మమేకమయ్యారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ జయం ఫణీంద్రతో పాటు వార్డు కౌన్సిలర్లు, పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.
దుర్గం మున్సిపాలిటీలో చెత్త బుట్టలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - ushasri charan dustbin distribution
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో.. ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ చెత్త బుట్టలను ప్రజలకు అందించారు. సీఎం జగన్ పాలనపై స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే ముచ్చటించారు.
dustbin