ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మడకశిరలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం - maize farmers

అనంతపురం జిల్లా మడకశిరలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తిప్పేస్వామి ప్రారంభించారు. మొక్కజొన్న ధర మార్కెట్లో తగ్గిపోయిన కారణంగా... ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసి.. రైతులను ఆదుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు.

ananthapuram district
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తిప్పేస్వామి

By

Published : Apr 23, 2020, 10:25 AM IST

అనంతపురం జిల్లా మడకశిరలో 500 హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. లాక్ డౌన్ వల్ల మొక్కజొన్న ధర మార్కెట్లో తగ్గిపోయిన కారణంగా.. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మద్దతు ధరతో పంటను కొనుగోలు చేస్తోంది. అందులో భాగంగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తిప్పేస్వామి ప్రారంభించారు. మొక్కజొన్నలను ఏపీ మార్క్​ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి క్వింటాలుకు రూ. 1760/- మద్దతు ధరను రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details