సెప్టెంబర్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రూ.864 కోట్లతో చేపట్టే ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడతామని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేసి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. చెరువులన్నీ నీటితో నింపడంతో లక్షల ఎకరాల బీడు భూములు సాగులోకి వస్తాయని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని లక్షల ఎకరాల బీడు భూములు సాగులోకి వస్తుందని అన్నారు.
'చెరువులను నింపి.. సస్యశ్యామలం చేయడమే సీఎం జగన్ లక్ష్యం' - కృష్ణా జలాలపై ఎమ్మెల్సే శ్రీధర్ రెడ్డి కామెంట్స్
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని చెరువులను కృష్ణా జలాలతో నింపి సస్యశ్యామలం చేయడమే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు. నీటి రాకతో బీడు భూములు సాగులోకి వస్తాయన్నారు.
!['చెరువులను నింపి.. సస్యశ్యామలం చేయడమే సీఎం జగన్ లక్ష్యం' mla sridhar reddy on irrigation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12350955-552-12350955-1625382997927.jpg)
mla sridhar reddy on irrigation