ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పట్టాలి: ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి - ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చెరువులు పరిశీలన

అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని చెరువులు, కుంటలను పరిశీలించారు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో.. చెరువులకు గండి పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

mla sridhar reddy advised to officers
ప్రతి నీటిబొట్టు ఒడిసిపట్టండి

By

Published : Oct 12, 2020, 4:44 PM IST

పుట్టపర్తి నియోజకవర్గంలోని చెరువులు, కుంటలకు ఎక్కడా గండి పడకుండా చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చిత్రావతి నది పరిసర ప్రాంతాలతో పాటు, చెరువులు, కుంటలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న చెరువు కట్టలకు వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు.

ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నీరు వృథా కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువుల్లో నీరు నిలువ ఉంటేనే బోరుబావులతో పాటు తాగునీటికి సమస్య ఉండదన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 60 శాతం చెరువుల్లోకి వర్షపు నీరు చేరడంపై ఎమ్మెల్యే ఆనందం సంతోషం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details