అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన జావేద్, పవన్, రాజు అనే ముగ్గురు యువకులు కూలీ పనుల కోసం కర్ణాటకలోని శివమొగ్గ వెళ్లారు. ఈనెల 22న అక్కడ జరిగిన పేలుళ్లలో ముగ్గురు దుర్మరణం చెందారు. బాధిత కుటుంబాలను రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పరామర్శించారు. అనంతరం ఒక్కొ కుటుంబానికి రూ. లక్ష చొప్పున రూ. 3 లక్షల చెక్కులు అందజేశారు.
పేలుళ్లలో మరణించిన యువకుల కుటుంబాలకు ఆర్థిక సహాయం - anantapur district latest news
ఈనెల 22న కర్ణాటకలో జరిగిన పేలుళ్లలో మరణించిన యువకుల కుటుంబాలను రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పరామర్శించారు. ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
![పేలుళ్లలో మరణించిన యువకుల కుటుంబాలకు ఆర్థిక సహాయం mla ramachandra reddy financial help](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10388613-218-10388613-1611661231952.jpg)
పేలుడులో మరణించిన యువకుల కుటుంబాలకు ఆర్థిక సహాయం
బాధిత కుటుంబాలకు వైఎస్సార్ బీమా అందించాలని అధికారులను ఆదేశించారు. ఇంటి స్థలాలు, పక్కా ఇల్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం తరఫున బాధితులకు నష్టపరిహారం అందేలా చూస్తామని కాపు అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు దంపతులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.